Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ఫిషింగ్ హార్బర్ ఘటన – బాధితులకు ఆర్థిక సాయం

ఫిషింగ్ హార్బర్ ఘటన – బాధితులకు ఆర్థిక సాయం

by Prakash

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయిన వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనుంది. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. చేసే సాయానికి కూడా అంతశాతం..ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించింది. బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.

Advertisements

You may also like

Our Visitor

019431
Total views : 90706

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.