Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News కుప్పకూలిన సైనిక విమానం….

కుప్పకూలిన సైనిక విమానం….

by Prakash
An American military aircraft in the Sea of Japan

అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్‌ సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. జపాన్‌లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ధ్రువీకరించింది. అయితే, అందులో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు. జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి. విమానం ఎడమ ఇంజిన్‌ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని అక్కడి మీడియాకు స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

మరో వైపు ఓస్ప్రే అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగానూ పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్‌ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది. ఆ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కూలిపోయాయి. 2000వ సంవత్సరం నుంచి దాదాపు 12 విమానాలు కూలిపోయాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: