Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌….

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌….

by Prakash
Bhajanlal Sharma

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్‌ శర్మను సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్‌లాల్‌ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్‌ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్‌ వాసుదేవ్‌ దేవ్‌ నాని ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి రాజనాథ్‌ సింగ్‌, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్‌ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్‌ శర్మ పేరును రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్‌రామ్‌, గజేంద్ర షెకావత్‌, అశ్విని వైష్ణవ్‌ లాంటి సీనియర్ల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్‌ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్‌లాల్‌ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తరహాలోనే రాజస్థాన్‌ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్‌ శర్మ.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు. భజన్‌ లాల్‌ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: