Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Latest News పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ

by Satya
Modi

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడారు. విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పరీక్షా పే చర్చా 7వ ఎడిషన్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు. PPC మొదటి మూడు ఎడిషన్లు ఢిల్లీలోని టౌన్-హాల్‌లో ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా 4వ ఎడిషన్ ఆన్‌లైన్‌లో జరిగింది. పరీక్షా పే చర్చ 5, 6వ ఎడిషన్లు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఒత్తిడి తీసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని ప్రోత్సహించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులను సూచించారు. రోజుకు 15 గంటలు చదవాలని ఒత్తడి చేయొద్దని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: