Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh ఉత్తరాంధ్రలో లోకేశ్ శంఖారావం యాత్ర

ఉత్తరాంధ్రలో లోకేశ్ శంఖారావం యాత్ర

by Satya
Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర ప్రారంభించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో పాల్గొన్న లోకేశ్ అనంతరం పలాస సభకు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని అభివర్ణించారు. అమ్మ ప్రేమకు కండిషన్లు ఎలా ఉండవో, ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే, ఈ వైసీపీ హయాంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు డీఎస్సీ, డీఎస్సీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడన్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీతో 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడన్నారు. 2లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి, తప్పాడన్నారు. కేవలం 6 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించాడన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటించే బాధ్యత తనదన్నారు.

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: