Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra PradeshPrakasam నల్లమల్ల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం..

నల్లమల్ల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం..

by Rama
Road Accident

రోడ్డు ప్రమాదం (Road Accident):

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చింతల చెంచు గుడానికి సమీపాన మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 20 మంది కూలీలు గాయాల పాలయ్యారు. ఈరోజు ఉదయం 09.00 గంటల సమయం AP 27 TY 7866 లారీ డ్రైవర్ శ్రీశైలం నుండి దోర్నాలకి వెళ్తుండగా AP 27 TU 6741 ఆటో డ్రైవర్ ప్రకాశం జిల్లా చింతల గ్రామం నుండి చెంచు గిరిజన కూలీలను ఆటో నందు ఎక్కించుకొని దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామనికి పచ్చిమిర్చి కోయడానికి వెళ్లే సమయంలో వెనక నుండి లారీ ఆటోని డీ కొట్టడం జరగడంతో, ఆటో నందు 20 మంది కూలీలు గాయాల పాలయ్యారని దోర్నాల పోలీస్ అధికారులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తూ ఉన్న 24 మంది కూలీలలో 18 మంది కూలీలకు రక్త గాయాలు కాగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై దోర్నాల పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన …
బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర …
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014835
Total views : 81117

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.