Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం..!

పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం..!

by Satya
Fire accident in paper factory


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) అశ్వారావుపేట లోని పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఫ్యాక్టరీ వెనుక భాగంలో వేస్ట్ పేపర్ స్టోర్ వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలు చూసి చుట్టుపక్కల నివాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఎట్టకేలకు ఫ్యాక్టరీ సిబ్బంది మంటలు అదుపు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన అనుభవమున్నప్పటికీ.. ఫ్యాక్టరీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు తీసుకున్న ఆనవాళ్లు మచ్చుకు కూడా కనపడవు.

నేడు ధరణి పోర్టల్‌ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తక్కువ జీతాలకు వచ్చే ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి ఇక్కడ పనిచేయిస్తున్న సమయంలో, ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేస్తారని ఆరోపణలు లేకపోలేదు. ఫ్యాక్టరీ వ్యర్థాల చుట్టూ పక్కల కాలనీల్లో పడుతున్నాయని కాలనీ వాసులు నిత్యం గొడవలు చేస్తూనే వుంటారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి ఫ్యాక్టరీ పై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90538

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.