ప్రపంచంలో శివుడు ఎక్కడ చూసినా లింగ రూపంలో కనపడతాడు. కానీ శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి గ్రామంలో మానవకార రూపంలో వెలిశాడు(Shivayya in human form). శ్రీ సత్య సాయి జిల్లా(sri sathya sai) అమరాపురం మండలం హేమావతి గ్రామంలో శివరాత్రి పర్వదినాన హెంజేరు సిద్దేశ్వర దేవాలయానికి పోటెత్తారు శివ భక్తులు. భారతదేశంలో ఎటు చూసినా శివుడు లింగాకారంలోనే దర్శనం ఇస్తాడు కాని శ్రీ సత్య సాయి జిల్లాలోని హేమవాతి గ్రామంలో మాత్రమే మానావాకారంలో దర్శనమిస్తాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నేడు అంకురార్పనతో ప్రారంభమై స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ శివరాత్రి పర్వదినాన మానవ రూపంలో వున్న శివున్ని దర్శించుకోవడానికి ఆంధ్ర,కర్ణాటక నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారు జాము నుండి పరమ శివుడికి అభిషేకాలు చేపట్టారు అర్చకులు. కరోనాతో మూడేళ్ల నుండి ఉన్న ఆంక్షలు తొలగించారు అధికారులు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90583