Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి..

భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి..

by Rama
died

అనంతపురం : కళ్ల ముందే భర్త హత్య జరగడంతో తట్టుకోలేక మనస్తాపంతో భార్య మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జేఎన్టీయూ సమీపంలో మూర్తి రావు గోఖలే(59), ఆయన భార్య శోభ(56) నివసిస్తున్నారు. మూర్తి రావు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తన మేనల్లుడు ఆదిత్య దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కత్తితో ఆదిత్య.. మూర్తిరావు గొంతు కోసి హతమార్చాడు. కళ్ల ముందే భర్త మృతిచెందడంతో జీర్ణించుకోలేక ఆదివారం అర్ధరాత్రి శోభ గుండెపోటుతో మృతి చెందారు. దంపతుల మృతితో ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రాష్ట్ర ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం !


ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.
ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో …
ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.
శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని …
తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: