Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh శ్రీశైలం కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ…

శ్రీశైలం కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ…

by Prakash
శ్రీశైలం

శ్రీశైలం :

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న సాత్వీకబలులను నిర్వహించేందుకు కొబ్బరికాయలు, నిమ్మకాయలు సిద్దం చేశారు. ముందుగా ఆలయంలో అర్చకులు వేదపండితులు అమ్మవారికి ప్రత్యేకపూజలు పూజలు నిర్వహించారు. ఈఓ పెద్దిరాజు సిబ్బంది అమ్మవారికి కొబ్బరి కాయలు పసుపు కుంకుమను శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయానికి బాజా భజంత్రీల నడుమ తీసుకువెల్లగా అక్కడ ప్రత్యేకపూజలు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం. ఆలయ సంప్రదాయం అందులో బాగాంగా ఇవాళ‌ శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని …
శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.
శబరిమల యాత్రలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గురుస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. …
విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.
విశాఖ కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 28 నుంచి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: