Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News విష ప్రయోగం తో పాడి గేదెలు మృతి…

విష ప్రయోగం తో పాడి గేదెలు మృతి…

by Prakash
Buffaloes

గేదెలు (Buffaloes)

అక్కన్నపేట గ్రామంలో విష ప్రయోగంతో పాడి గేదెలు (Buffaloes) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు మట్టెల కనకయ్యకు చెందిన రెండు గేదెలపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో మృతి చెందాయి. గేదెలకు పెట్టే కుడిదిలో విషపు గుళికలు కలపడంతో అది తాగి మృతి చెందినట్లు బాధిత రైతు కనకయ్య తెలిపారు. రెండు గేదెలు ఒక్కోటి రోజుకు 8 లీటర్ల చొప్పున పాలు ఇస్తుండేవని కన్నీటి పర్యంతమయ్యారు. సుమారు రెండు లక్షల విలువచేసే పాడి గేదెల మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కోరారు.
బాధిత రైతు కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పశు వైద్యాధికారి చేత పోస్టుమార్టం చేయించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: