Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…

by Prakash
Congress party booth level workers meeting

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అలాగే పరిగి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక మతతత్వ పార్టీతో ఎదుర్కొంటున్నాం.

కాబట్టి లౌకికవాదంతో ముందుకు పోవాలి హిందూ ముస్లిం దీన్ని కలిసికట్టుగా ముందుకు సాగాలి మతాల మధ్య చిచ్చు పెడుతుంది. బిజెపి కాబట్టి ఈ 75 సంవత్సర కాలంలో కూడా ఇలాంటి మత రాజకీయాలు చేయడం బిజెపి ఎంతవరకు సమంజసం ఇలాంటి దుష్పాచారాలు ఏ కార్యకర్త కూడా నమ్మకూడదు. 86% మంది హిందువులు ఉన్న దేశంలో ఏనాడు కూడా మతాల మధ్యన గొడవలు కాలేవు మనం అందరం 41 రోజులు ఎలక్షన్ కు రోజులున్నాయి. కాబట్టి ఒక దీక్ష పూనుకున్నట్టు ముందుకు సాగాలి స్థానిక సంస్థల్లో కూడా మనము సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా మనమే అన్ని గెలిచి ముందుండాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

019154
Total views : 90020

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.