Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home National వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు..

వారణాసిలో మోదీ నామినేషన్ దాఖలు..

by Rama
Narendramodi

ప్ర‌ధాని మోదీ (Narendra Modi) యూపీలోని వార‌ణాసి లోక్‌స‌భ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేష‌న్ దాఖ‌లు చేయనున్నారు. నామినేష‌న్ వేయ‌డానికి ఒక‌రోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా అధికారుల స‌మాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించ‌డానికి ముందు ప్ర‌ధాని లంక‌లోని బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద ఉన్న మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వ్య విగ్ర‌హానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ త‌ర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర‌ కొన‌సాగుతుంది. ల‌క్ష‌లాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవ‌కాశం ఉంది. అస్సి, సోనార్‌పూర‌, జంగం బ‌రి, గోడౌలియా, బ‌న్స్‌ప‌థ‌క్ మీదుగా విశ్వ‌నాథ్ కారిడార్‌కు చేరుకుంటుంద‌ని బీజేపీ నేత దీలిప్ ప‌టేల్ వెల్ల‌డించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా నిర్వ‌హించే బాధ్య‌త‌ను పార్టీ కార్య‌కర్త‌ల‌కు అప్ప‌గించిన‌ట్లు చెప్పుకొచ్చారు. వార‌ణాసి పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో ప్ర‌త్యేక‌ సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన‌ త‌ర్వాత 21 డివిజ‌న్ల‌లోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌ధాని రోడ్ షోకు భారీ సంఖ్య‌లో జ‌నాల‌ను తీసుకువ‌చ్చేలా దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఇక వార‌ణాసి నుంచి మోదీ ఇప్ప‌టికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ‌రుస‌గా 2014, 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌ఢంకా మోగించారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
    కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
  • అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
    అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
  • శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
    శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్‌ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: