గురువారం రోజు ఉదయం రాయచోటి బస్టాండ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరుల ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. కాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవల అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లిఅన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని మాది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వము అని పేర్కొన్నారు… రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
- ఆర్మీ వెపన్స్ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.