ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు.మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరై పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరమ్మత్తులకు మరియు ఒకటవ వార్డు నుంచి 31 వ వార్డు వరకు మున్సిపాలిటీ వాటర్ పైపు లేని పట్టణ శివారు ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించే ఈ రెండు అంశాలను కౌన్సిల్ తో కలసి ఆమోదించారు.అనంతరం కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కమిటీ ద్వారా చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మాచర్ల పట్టణం లోనే డెంగ్యూ వ్యాధి అధిక కేసు నమోదు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని సానిటరీ విభాగం వారు దోమలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు అతి త్వరలోనే బుగ్గ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా మంచి నీటిని అందిస్తామన్నారు మాచర్ల పట్టణానికి వెల్దుర్తి మాచర్ల మండలం దుర్గి రెడ్డి చింతల మండలాల నుండి అత్యధిక సంఖ్యలో మహిళలు తమ కుటుంబాల కోసం వస్తూ ఉంటారని వారికి కనీస మరుగుదొడ్లు లేవని వాటి దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరలో పట్టణంలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిలర్లు మొత్తం జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు కౌన్సిలర్లు మదర్ సాహెబ్ రామిరెడ్డి నరసింహారావు సుభాని మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు మున్సిపల్ ఏఈ లు సిబ్బంది పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.