Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్

మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్

by Satya
మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్

జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మేయర్‌,డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్‌ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ బీఆర్ఎస్‌కు బై చెప్పి… హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ్టి మీటింగ్‌పై ఆసక్తి నెలకొంది. వారిద్దరిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారంటూ,మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్ అయ్యింది. అయితే మొన్నటివరకు బీఆర్ఎస్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేసిన ఎంఐఎం పార్టీ , బీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తుందా…? లేక కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుందా…? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే ఎంఐఎం ఎవరికి మద్దతిస్తే , వారికే బల్దియా పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం 47 మంది కొర్పొరేటర్లు ఉండగా.. ఎంఐఎంకి 41. బీజేపీకి 39, ఇటు కాంగ్రెస్‌కు 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా , అధికారంలోకి రావడంతో వారి సంఖ్య 19కి చేరింది. అయితే కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ , ఏదో ఒకపార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్‌ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్‌ వస్తారన్నది క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ స్టాండ్‌పైనా తెగ చర్చ నడుస్తోంది. కౌన్సిల్‌ మీటింగ్‌లో వారు ఏం మాట్లాడతారు…? వారి వ్యూహమేంటన్నది…? ఉత్కంఠగా మారింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039202
Total views : 194708

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: