Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Political అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

by Rama
అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్, అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక యువత తెలంగాణ, కర్ణాటక వెళ్లాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా గత ఐదేళ్లలో ఉన్నత విద్య పూర్తి చేసిన నిరుద్యోగ యువత కనిపిస్తున్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన చేస్తున్న సమయంలో అంజనాస్ ఫౌండేషన్ వారు ముందుకు రావటంతో వారితో కలిసి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతీ యువకులు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందాలని కోరారు. ఇంకా మరిన్ని కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91127

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.