బఫర్‌జోన్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశామని, కానీ ఆ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొన్ని కట్టడాలను కూల్చినప్పుడు హైడ్రా బాగా పని చేసిందని కితాబునిచ్చారని, ఇప్పుడు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారని వాపోయారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామన్నారు.
అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఓ ఆసుపత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ అదేచోట మళ్లీ నిర్మించారని తెలిపారు. అమీన్‌పూర్‌లో ఆసుపత్రిని కూల్చేశారని చెబుతున్నారని, కానీ ఆ ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేరని వెల్లడించారు.
ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదన్నారు. ఇటీవల కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలను కూల్చివేశామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ఖాళీ చేయలేదని తెలిపారు.
హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని గుర్తించాలన్నారు. హైడ్రాను బూచిగా చూడవద్దని, చూపించవద్దని కోరారు. ఎవరికైనా సమయం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెరువులను, నాలాలను కాపాడుకోలేమన్నారు. ఆస్తుల రక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకువచ్చారన్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్నారు.
హైడ్రాను ఏర్పాటు చేసి రెండు నెలలు అయిందన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను పరిరక్షించే బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం మన హక్కు అని, ప్రజల ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలోనే ఉందని వెల్లడించారు. పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదన్నారు. కానీ అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212528