భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ల డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
లంచం, మోసపూరిత కుట్ర కింద నేరారోపణలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి