Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana మాయమైపోతున్న మానవత్వం

మాయమైపోతున్న మానవత్వం

by Rama
మాయమైపోతున్న మానవత్వం

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నన్ను కాపాడండి .. హాస్పిటల్ కు తీసుకెళ్లండి అని పక్కన ఉన్నవాళ్ళని ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ మానవత్వంతో ముందుకు రాలేదు. తన బాధను ఎవరు పట్టించుకోలేదు. ప్రేక్షకుల్లా నిలపడి వీడియోలు ఫొటోలు తీస్తూ లలక్షేపం చేసారు.ఇదంతా హైదరాబాద్ లో కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే … వరంగల్‌కు చెందిన వి.ఎలేందర్ (35) కీసర సమీపంలోని రాంపల్లి నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం కీసరలో నిర్మిస్తున్న కొత్త ఇంటి పనులను చూసేందుకు తన బైక్ ఫై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఎలేందర్ ఒక్కసారి గా బైక్‌ పై నుంచి రోడ్డుపై పడిపోయాడు. కేకలు వేయడంతో స్థానికులు గమనించి డ్రైవర్ లారీని రివర్స్ చేశాడు. దీంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లాయి. నన్నువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లండి అని ఎంత వేడుకున్న వాళ్ళు ఎవరు సాయం చేయలేదు. చుట్టుపక్కల జనం అంబులెన్సు కు సమాచారం అందించగా… వారందరిని చూసి ఎలేందర్‌ నిస్సహాయ స్థితిలో వుండిపోయాడు. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చే సరికి అప్పటికే బాధితుడు ఎలేందర్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019514
Total views : 90901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.