Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana లగచర్ల దాడి కేసులో నిందితుడు సురేష్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ

లగచర్ల దాడి కేసులో నిందితుడు సురేష్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ

by Rama
లగచర్ల దాడి కేసులో నిందితుడు సురేష్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ

లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికి కోర్టు రెండు రోజుల కస్టడికి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ లో సురేష్ ను పోలీసులు ఇవ్వాళ, రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్ కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు.. చర్చలు ఏమిటన్నదానిపై పోలీసులు సురేష్ ను ప్రశ్నించనున్నారు.

మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు..దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనులనే రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తారని తెలుస్తోంది. దుగ్యాల మండలం నుంచి కలెక్టర్ సభను లగచర్లకు ఎందుకు మార్పించారన్నదానిపై నిందితుడి నుంచి వివరాలు రాబట్టనున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అధికారులపై దాడులు చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డి, లేక ఇంకెవరి ప్రోద్భలం ఉందన్న విషయాలపై సురేష్ ను ప్రశ్నించి కేసు విచారణను మరింత పగడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ ఎవరి పేర్లు బయటపెడుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.
    ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
  • నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.
    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
  • అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.
    అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
  • పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.
    రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
  • కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.
    ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040944
Total views : 212472

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: