Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshNeloore సింగనపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

సింగనపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

by CVR NEWS

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మేకపాటి విక్రమ్ రెడ్డిని మాజీని చేయడం దురదృష్టకరమని, ప్రజలే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తమపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఆయన అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇదే క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో 20 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

038940
Total views : 193192

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: