నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మేకపాటి విక్రమ్ రెడ్డిని మాజీని చేయడం దురదృష్టకరమని, ప్రజలే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తమపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఆయన అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇదే క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో 20 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
water plant
పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం… స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలోని వాటర్ ప్లాంట్ (Water Plant) లో వాటర్ ట్యాంక్ (Water Tank) క్లీన్ చేస్తూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వల్లెం శివ 40 విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. శివ తో పాటు అతను పెంచుకుంటున్న కుమారుడు ప్లాంట్ యజమాని కలిసి పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. శివ తన కుమారుని పక్కకు నెట్టేసి తాను మాత్రం తప్పించుకోలేకపోయాడు. శివ కుమారుడికి, ప్లాంటే యజమానికి స్వల్ప గాయాలయ్యాయి కాగా శివ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన శివ గత పదిఏళ్ళ క్రితం మాచర్ల వచ్చి ఇక్కడే ఉంటున్నాడు రోప్ లైన్ బోడు ఏడో వార్డులో నివాసం ఉంటున్నాడు అతనికి వివాహం కాలేదు ఒక పిల్లాడిని పెంచుకుంటున్నాడుపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: ఎస్సీలను వంచించే పార్టీ..? తాటిపర్తి చంద్రశేఖర్..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని వై కోట గ్రామంలో ఈ రోజు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కారూపానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ నుంచి 5 లక్షల రూపాయలు సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా వై కోట గ్రామానికి వచ్చి ప్రజలు ఎంతో గొప్పగా ఆయనను స్వాగతించి పూల వర్షం కురిపించారు జనసముద్రం అంతా ఆ గ్రామంలో అక్కడే కనబడింది గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ మాకు తన సొంత నిధులు ఇచ్చి ఈ ప్లాంట్ నిర్వహించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి మా గ్రామం తరపున గ్రామ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే కాదనకుండా ప్లాంట్ సంబంధించి అమౌంట్ వేసి ప్రారంభించే దానికి ఆయనే రావటం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. ఎన్నో వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముక్కా రూపానంద్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని ఆ గ్రామం ఎంత మార్మోగింది. ముక్కా రూపానంద్ రెడ్డి మాట్లాడుతూ వైకోట గ్రామానికి సంబంధించి ఎటువంటి కష్టమొచ్చినా ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రావచ్చు అని ఏదైనా నేను చేసే దానికి సిద్ధమని ఆయన అన్నారు. గ్రామస్తులంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేయడం జరిగింది. ఈ గ్రామం నాది ఇక ఈ గ్రామానికి ఏమి కావాలన్నా అందరి కంటే నేను ముందుంటాను ఏమి కావాలన్నా నేను చేస్తానని ఆయన అన్నారు.




Total views : 74516