Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News ఇరాన్‌తో యుద్ధంలో ఒంటరైపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌.

ఇరాన్‌తో యుద్ధంలో ఒంటరైపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌.

by CVR NEWS

ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెద్ద తప్పు చేశారా..? అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అమెరికా ఒంటరైందా..? వీలైనంత త్వరగా యుద్ధం ఆపాల్సిన పరిస్థితికి ట్రంప్‌ చేరుకుంటున్నారా..? మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. ఇదే ఖాయమనిపిస్తోంది. తనకు ఎదురు ఎవరూ లేరు అన్న రీతిలో విర్రవీగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్‌ మీద ఇజ్రాయిల్‌తో యుద్ధం మొదలుపెట్టించిన ఆయన… ఆ తర్వాత స్వయంగా దాడులకు దిగారు. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నా రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఓ వైపు ఆయుధ సంపత్తి తరిగిపోతుండడం… ఖరీదైన క్షిపణుల వినియోగం కారణంగా వేల కోట్లు కరిగిపోతుండడం.. ట్రంప్‌తో పాటు అమెరికా సమాజాన్ని మొత్తం కలవరపెడుతోంది. యుద్ధం ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగితే… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం లేకపోలేదని ఆ దేశ ఆర్థిక నిపుణులే చెబుతున్నారంటే.. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు స్వదేశంలో సిచ్యుయేషన్‌ ఇలా ఉంటే.. ట్రంప్ మాత్రం యుద్ధోన్మాదాన్ని వీడడం లేదు. ఇరాన్‌ను పూర్తి స్థాయిలో నాశనం చేస్తే తప్ప తనకు నిద్ర పట్టదు అన్న స్థాయిలో ప్రవర్తిస్తున్నారు..

అయితే డొనాల్డ్ ట్రంప్‌ వ్యూహాలకు ఇరాన్‌ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి మూసేసి… యావత్‌ ప్రపంచం చమురు రంగం గొంతు నొక్కేసింది ఇరాన్‌. దీంతో దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. ఇంకొద్ది రోజులు సంక్షోభం ఇలాగే కొనసాగితే… చాలా దేశాలు ఆర్థికంగా దివాళా తీసే ప్రమాదం నెలకొంది. ఇదే సమయంలో ట్రంప్‌ బెట్టు వీడకుండా ఇరాన్‌ను దారికి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు తనతో కలసి రావాలంటూ పిలుపునిచ్చారు. హర్మూజ్‌ జలసంధి తెరిపించడానికి అన్ని దేశాలు సహకారం అందించాలంటూ ఆయన చేసిన ప్రకటనపై ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించలేదు. ఈ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నాటో స్పష్టం చేస్తే.. భారత్‌, జపాన్‌, బ్రిటన్‌ సహా అనేక దేశాలు తమది తటస్థ వైఖరి అని తేల్చేశాయి. ఇక చైనా అయితే ఏకంగా ముందుగా అమెరికా సైనిక చర్యలను ఆపేయాలంటూ తెగేసి చెప్పింది. ఇంతకాలం అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన దేశాలు సైతం… ఈ వ్యవహారంలో అంటీ ముట్టకుండా ఉంటున్నాయి…

అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడంతో ట్రంప్‌పై ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు ఈ విషయంలో చర్చలకు ఎలాంటి తావు లేదని… ఎందాకైనా పోరాటానికి సిద్ధమని ఇరాన్‌ కుండబద్దలు కొట్టేసింది. ఈ నేపథ్యంలో తగ్గాల్సింది ఎవరైనా ఉన్నారంటే… అది అమెరికా, ఇజ్రాయిలే అన్నది తేలిపోతోంది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ట్రంప్‌ వెనక్కి తగ్గుతారా… లేక తన మొండితనం తనదే అంటూ.. అమెరికా భవితవ్యాన్ని ఫణంగా పెట్టి యుద్ధాన్ని కొనసాగిస్తారా… వేచి చూడాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: