Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని…

దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని…

by CVR NEWS

దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని, అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజన, 50 శాతం ఎంపీ సీట్ల పెంపు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎంపీ స్థానాల విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఉందన్నారు. అంతే స్థాయిలో సీట్ల పెంపు జరగాలని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. 50 శాతం సీట్ల పెంపు ఏ లెక్క ప్రకారం జరుగుతుంది? అలా సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్‌ బుల్లెట్‌ అని సీఎం అన్నారు. ఈ పద్ధతిలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పుడున్న 40 సీట్లు 60 అవుతాయని, అదే యూపీలో 80 సీట్లు 120 అవుతాయన్నారు. అలా మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బిహార్‌… ఈ నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందఇ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే సీట్ల వల్ల దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుందని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్‌డీయే ప్రభుత్వం పెంచుతోందన్న ఆయన, అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి సీట్ల పెంపుపై ముందుకు వెళ్లాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని సీఎం తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: