267
తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాలేశ్వరం నిర్మాణం, అందులో జరిగిన అవినీతి , సాంకేతిక లోపాలపై కేంద్రం ఘాటుగా స్పందించింది.కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నీళ్లలో పోశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.