Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International  అమెరికాను నంబర్ వన్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..

 అమెరికాను నంబర్ వన్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..

by CVR NEWS

అమెరికాను నంబర్ వన్ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, దూకుడు స్వభావం ఆయన ఇమేజ్‌ను భారీగా దెబ్బతీశాయి. తాజా సర్వేల ప్రకారం అమెరికన్లలో ట్రంప్ పట్ల ఆదరణ నానాటికీ తగ్గిపోతూ.. ఇప్పుడు ఏకంగా మైనస్‌లోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.

ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొల్పడం ట్రంప్‌కు ముప్పుగా మారింది. అనవసర యుద్ధాలతో దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఏఎఫ్ పోస్ట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ట్రంప్ ప్రజామోదం రేటింగ్ మైనస్ 17కు పడిపోయింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు దక్కిన అత్యల్ప రేటింగ్ ఇదే… అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడికి లేనంత దారుణమైన వ్యతిరేకతను ట్రంప్ మూటగట్టుకున్నారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జో బైడెన్, జిమ్మీ కార్టర్, రోనాల్డ్ రీగన్ వంటి వారితో పోలిస్తే ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. 2016లో మొదటిసారి గెలిచినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా.. రెండో దఫాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మార్చి 26న ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పనితీరుపై కేవలం 41 శాతం మంది మాత్రమే మొగ్గు చూపగా.. ఏకంగా 59 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో కూడా మద్దతు 92 శాతం నుంచి 84 శాతానికి పడిపోయింది. ఇక డెమొక్రాట్లలో 95 శాతం మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా అట్టుడుకుతోంది. గత వారాంతంలో 50 రాష్ట్రాల్లో సుమారు 80 లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన గళం విప్పారు. ఇరాన్‌తో యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికన్లు చేసిన ఈ పోరాటం.. ట్రంప్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. దూకుడు కంటే ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: