Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..

by CVR NEWS
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు కలిసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యలో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా.. ప్రాక్టికల్స్, మ్యాథ్స్ మార్కుల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థుల్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో భయాన్ని పోగొట్టి వాటిపై ఆసక్తి పెంచేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇంటర్లో సెకండియర్లోనే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ కొత్త మార్పుల ప్రకారం.. ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ,బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఏడాదికి 15 మార్కుల చొప్పు ప్రాక్టికల్స్ చేయించనున్నారు. దీనివల్ల ఫస్టియర్ నుంచే వాటిపై పట్టు సాధించే ఛాన్సుంటుంది. అలాగే మ్యాథ్స్ లో యాక్టివిటీ బెస్డ్ లెగ్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ప్రతి ఏటా 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయిస్తారు. ఫైనల్ పరీక్షల్లో మ్యాథ్స్ 75 మార్కులకు బదులుగా 60 మార్కులకు మాత్రమే నిర్వహించేలా ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. వార్షిక పరీక్షను కూడా 100కు బదులుగా 80 మార్కులకే పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించింది. మిగతా 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారానే కేటాయిస్తారు. ఇక లాంగ్వేజీల్లో కూడా ఇదే విధానం అమల్లోకి రానుంది. బట్టీపట్టే విధానాన్ని తగ్గించి.. వారి జ్ఞాపకశక్తిని పెంచేలా, ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంచడమే ఈ నూతన విద్యావిధానం లక్ష్యమని బోర్డు స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

040924
Total views : 212396

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: