Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

by CVR NEWS
తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌

తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌తో సమయానికి పావుగంట ముందే సచివాలయానికొచ్చేస్తున్నారు. లంచ్‌ బ్రేక్‌ టైమ్‌లో తన చాంబర్‌లోనే భోజనం ముగించి మళ్లీ పనిలో నిమగ్నమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా, ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయాలపై ఫోకస్‌ పెడుతున్నారు. ఇందులో భాగంగా కీలక ఫైళ్లను పరిశీలిస్తూ..ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయన పనిలో చూపుతున్న వేగం, నిబద్ధత అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014479
Total views : 80330

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.