Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News అసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్ పర్యటన..

అసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్ పర్యటన..

by CVR NEWS
అసిఫాబాద్ జిల్లాలో జూన్ 2న సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన ‘జూన్ 2’ను పురస్కరించుకొని రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా, ఇప్పుడు ‘సెకండ్ ఫేజ్’ పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మిగిలిపోయిన హామీలను నెరవేర్చడంతో పాటు, కొత్త అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్​లెస్ ట్రీట్మెంట్, రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు జూన్ 2న వెలువడనున్నాయి. ఇదే నెలలో యంగ్​ ఇండియా స్టూడెంట్​ కిట్​ను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. త్వరలో జరగనున్న కేబినెట్​ భేటీలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ఆయా పథకాలపై సుదీర్ఘంగా చర్చించి, నిధుల కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: