Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Film మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం..

మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం..

by CVR NEWS
మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌లే మ‌న శంక‌ర వ‌ర‌ప్రసాద్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా ఆయ‌న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. చిరు కెరీర్‌లో 158వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాబీ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ రోజు పూజా కార్యక్రమాల‌తో మొద‌లైంది. ముఖ్య అతిథులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్‌చ‌ర‌ణ్‌, నాగ‌బాబు, ద‌ర్శక నిర్మాత‌లు హాజ‌రు అయ్యారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌మన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్.ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. వాల్తేరు వీర‌య్య త‌రువాత చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం వ‌స్తుండ‌డంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039551
Total views : 198578

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: