Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

by CVR NEWS
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం

సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు.. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణా శిబిరానికి అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అండర్-12 నుంచి అండర్-19 విభాగాల వరకు దాదాపు 120 మంది విద్యార్థులు ఈ క్యాంప్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అనుభవజ్ఞులైన కోచ్‌లు ప్రతిరోజూ ఉదయం వీరికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్‌లో మెళకువలు నేర్పిస్తున్నారు. ఆటతో పాటు వార్మప్ ఎక్సర్‌సైజులు, రన్నింగ్ వంటివి చేయిస్తూ పిల్లల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం ప్రతిభావంతులైన పిల్లలు ఈ క్యాంప్‌కు వస్తున్నారని.. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే క్రికెటర్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ శిక్షణపై కోచ్‌లు, అలాగే క్రికెట్ నేర్చుకుంటున్న చిన్నారులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: