Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News భారత్‌… అమెరికాకు కీలక భాగస్వామి -మార్కో రుబియో..

భారత్‌… అమెరికాకు కీలక భాగస్వామి -మార్కో రుబియో..

by CVR NEWS
భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి -మార్కో రుబియో

అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. భారతదేశానికి చెందిన కంపెనీలు తమ దేశంలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. భారత్‌కు ముడి చమురు సరఫరా చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మార్కో రుబియో భారత్‌కు వచ్చారు. ఢిల్లీలోని సేవాతీర్థ్‌లో దాదాపు గంటసేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యిరు. భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో అమెరికా-భారత్ సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు మార్కో రుబియో తెలిపారు. ప్రధాని మోదీకి, ట్రంప్‌కు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. వారిద్దరు కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తారని అన్నారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆ దేశం గురించి కూడా మార్కో రుబియో ప్రస్తావించారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

040924
Total views : 212396

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: