Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Crime ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం..

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం..

by CVR NEWS
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.ఇబ్రహీంపట్నం సమీపంలోని కూలింగ్ కెనాల్ డివైడర్‌ను బస్సు బలంగా ఢీకొట్టడంతో, బస్సు సగం భాగం గాల్లో వేలాడినట్లుగా నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019369
Total views : 90570

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.