68
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.ఇబ్రహీంపట్నం సమీపంలోని కూలింగ్ కెనాల్ డివైడర్‌ను బస్సు బలంగా ఢీకొట్టడంతో, బస్సు సగం భాగం గాల్లో వేలాడినట్లుగా నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






Total views : 90554