గ్రామీణ మహిళల ఆర్థిక ఆత్మగౌరవానికి పరకాల నియోజకవర్గం సరికొత్త వేదికైంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ‘పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వీ-హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల కలిసి అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై గ్రామీణ మహిళల శ్రమకు గుర్తింపుగా ‘రుద్రమ’ బ్రాండ్‌ను ఆవిష్కరించి.. దీని పరిధిలో నిర్మించనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, డైరీ ఫామ్, వర్క్ షెడ్ భవనాలకు భూమిపూజ చేశారు. వీ-హబ్ సీఈవో సీతా పల్లాచోళ్ల మాట్లాడుతూ.. పరకాల ఇందిరా మహిళా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా గ్రామీణ మహిళలకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ హబ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇక్కడ మహిళలు తయారు చేసే ‘రుద్రమ’ బ్రాండ్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేలా పూర్తి మార్కెటింగ్ సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.
27
previous post






Total views : 90594