భారత ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్‌లో ఘన స్వాగతం లభించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించారు. భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన ‘జోనాథన్’ అనే ఆల్డబ్రా జెయింట్ తాబేలును ప్రధాని మోదీ సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 194 ఏళ్ల వయస్సు కలిగిన ఈ తాబేలు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.
సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.
52





Total views : 180107