Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం.

https://cvrnews.net/tg-news-174/

by CVR NEWS
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘బకాయిలు పెట్టింది బకాసురుడు… కట్టే పాపం మాకా?’ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

వ్యవసాయాన్ని దండగ కాకుండా ఒక పండగలా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసమే అంకితభావంతో కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదిక సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల తో కలిసి ‘రైతు భరోసా’ నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారు… SPOT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుమారు 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే, వారంతా కలిసి చేసిన మొత్తం అప్పు 60 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, కానీ కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఏకంగా 8.11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ విజయవంతంగా మాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 22 వేల 600 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని గర్వంగా ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అన్నారు. కేవలం ఉచిత కరెంట్ కోసమే రూ.36 వేల కోట్లు చెల్లించామన్నారు. అలాగే వ్యవసాయ పనిముట్ల కోసం ఏటా వెయ్యి కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం ఏటా రూ.3,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, మధ్యాహ్న భోజనం డైట్ బిల్లులు, సర్పంచ్‌ల బిల్లుల బకాయిలు కూడా చెల్లించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టింది కేసీఆర్ అయితే, ఆ బద్నాం మరియు నిందలను మాత్రం ఇప్పుడు తాను మోయాల్సి వస్తోందన్నారు. గత పాలకుల విపరీతమైన అప్పుల కారణంగా ఢిల్లీలో సైతం తెలంగాణ పరువు పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కేవలం మూడేళ్లకే కూలిపోయి ‘కూలేశ్వరం’గా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. వానాకాలం పంటల పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా నిధులను సిద్ధం చేసి, మొదటి రోజే 41 లక్షలకు పైగా రైతు కుటుంబాల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలను జమ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని, అందులో భాగంగానే రానున్న కేవలం తొమ్మిది రోజుల్లోనే అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోలిస్తే మా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎక్కువగా ఇస్తోందన్నారు మంత్రి తుమ్మల. కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్కులు పొంది, ఇంకా ఈ పథకానికి నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి రైతులు జూలై 5వ తేదీ లోగా తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారినికలిసి తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే… వారికి కూడా నిధులు విడుదల అవుతాయన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్.. ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తి చేశారని అని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. కానీ, ఊరూరికి మాత్రం బెల్ట్ షాపులు తెచ్చి తాగులు కల్చర్ తెచ్చాడంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: