హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా యాప్ తో రైతులు కష్టాలు ఆరంభమయ్యాయి. సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, ఆధార్ లింకింగ్ లోపాలతో రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చదువు రాని రైతులు యూరియా బుక్ చేయలేకపోతున్నారు. భూ యజమానులు కౌలు రైతులకు ఓటీపీ చెప్పటానికి సంశయిస్తున్నారు. యూరియా బుకింగ్ ఓటీపీ అడిగితే అకౌంట్లో నుంచి ఏమైనా డబ్బులు కట్ అవుతాయన్న అనుమానంతో ఓటీపీ చెప్పటం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఎకరాకు నాలుగు బస్తాల యూరియా అవసరమైతే కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత పద్దతిలో రైతుల అకౌంట్లో సబ్సిడీ జమచేస్తే నేరుగా ఎరువుల దుకాణంలో కొనుకుంటామంటున్నారు. ఇదిలావుండగా జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేలపై చిలుకు బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.యూరియా యాప్ పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వాలంటీర్లను కూడా నియమించామని తెలిపారు. రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోయినా కీ పాడ్ మొబైల్ ఉన్నా ఓటీపీ చెప్తే ఫ్యాక్స్ సెంటర్లలో వాలంటీర్ బుక్ చేసి రైతులకు యూరియా అందించేందుకు సహాయపడతారన్నారు.
యూరియా యాప్‌తో రైతులకు కష్టాలు.
208
previous post