181
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉద్ధృతమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ స్థాయిలో వైమానిక, క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 54 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కీవ్‌లోని 30 ప్రాంతాల్లో నివాస భవనాలు, విద్యా సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా.. ఈ దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది.