Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Latest News వచ్చేవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు.

వచ్చేవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు.

by CVR NEWS
వచ్చేవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు

ఇరాన్‌ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు ఆ దేశం ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నాయకులైన సల్మాన్ ఖుర్షీద్, పవన్ ఖేరా కూడా పిలుపు అందినట్టు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న మరణించిన ఖమేని అంత్యక్రియలు వచ్చే వారం అధికారిక లాంఛనాలతో జరపనున్నారు. దీనికి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నుండి అధికారిక ఆహ్వానం అందింది. అయితే దీనికి నేరుగా మోడీ హాజరు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించడానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, షియా సమాజానికి చెందిన బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ హాజరవుతున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: