Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Film సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత.

సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత.

by CVR NEWS
సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత

సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు. అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన‌ సోనీ లివ్ త‌మిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. అందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో మెప్పించ‌నుండ‌టం విశేషం. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు.

ఒక వైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త‌ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. త‌మిళ్‌లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ప్రాజెక్ట్‌ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు.

ఈ కొత్త‌ ప్రాజెక్ట్ గురించి సమంత త‌న సోష‌ల్ మీడియాలో విష‌యాన్ని పోస్ట్ చేస్తూ.. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై వ‌ర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

సోనీ లివ్ తమిళ్‌తో కలిసి సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038937
Total views : 193126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: