Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ.

by CVR NEWS
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ

మేడ్చల్ జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు.ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానbని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలు తమ ఇళ్లు, కాలనీలు, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీ సురక్ష – నేను సైతం 2.0″ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3 వేల సీసీటీవీ కెమెరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో మొత్తం 2 లక్షల 45 వేల 35 సీసీటీవీ కెమెరాలు ఉండగా, ఈ ఏడాదిలోనే మరో 16 వేల 339 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో ఈ ఏడాది 214 కేసులను ఛేదించగలిగామని సీపీ తెలిపారు. అలాగే లండన్ తరహాలో డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించామని, త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ విధానాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపడతామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: