Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.

యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.

by CVR NEWS
యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ రిమాండ్‌ రిపోర్టులో గన్నవరం పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్‌ రెచ్చగొడుతున్నాడని.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్‌ ప్రకటనలు చేస్తున్నారని… మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉందని… ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్‌ మాట్లాడారని తెలిపారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని… పదవుల్లో ఉన్నవారిని దూషించడమే కాకుండా…. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.

మావోయిస్టు భావజాలాన్ని అతని ఫోన్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు… దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. రావణ్‌ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే అని స్పష్టం చేశారు. అతడికి సహకరిస్తున్నవారెవరో తేల్చాల్సి ఉందని… విచారణకు నిందితుడు సహకరించడం లేదని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్‌పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్‌ఎస్‌లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038920
Total views : 192750

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: