Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home International ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.

by CVR NEWS
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ ప్రెసిడెంట్‌ ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ను ప్రకటించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోడీకి అందజేశారు. ఈ పురస్కారం భారత ప్రజలందరికీ లభించిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు. ఇండోనేసియా దేశ సార్వభౌమత్వానికి, అభ్యున్నతికి విశేష సేవలు అందించిన వారికి 1959 నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తున్నారు. అంతకుముందు, జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన భారత్-ఇండోనేసియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038931
Total views : 193056

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: