Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్.

లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్.

by CVR NEWS
లోకేష్ హామీలు అమలు చేయాలని సీపీఎం డిమాండ్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీతానగరం శిలాఫలకం నుంచి క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్రగా బయల్దేరిన సీపీఎం నాయకులు, కార్యకర్తలను ఉండవల్లి సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులకు, సీపీఎం నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పేదలకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ వెంటనే అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.పాదయాత్రను అడ్డుకోవడంతో ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.అయితే అధికారుల హామీ మేరకు ప్రస్తుతం పాదయాత్రను విరమిస్తున్నట్లు సీపీఎం నాయకులు ప్రకటించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212125

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: