Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.

by CVR NEWS

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులు, బెదిరింపులు, అసభ్యకర సందేశాలు పంపినట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో పాటు దుర్భాషలాడారని, జులై 9న శారీరకంగా దాడికి పాల్పడి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు. అలాగే మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి తన భర్తకు పంపాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలపై అధికారిక విచారణ కొనసాగుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042041
Total views : 221458

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: