భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో 32 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.ప్రజల ఆశీర్వాదాలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, మెరుగైన వసతులతో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పేద ప్రజలకు విద్యతో పాటు సంక్షేమాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.పేదల సొంతింటి కల గత ప్రభుత్వంలో నెరవేరలేదని విమర్శించిన మంత్రి… ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇళ్లు కేటాయించామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కమిషన్లు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు.డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయల రుణాలను సున్నా వడ్డీతో అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
35
previous post




Total views : 221094