34
పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజల సమస్యలపై, తెలంగాణ పెండింగ్ హామీలపై సమగ్ర చర్చ జరగాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాలని.. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలన్న ఎంపీ.. రీజినల్ రింగ్ రోడ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు.




Total views : 221094