Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Crime సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

by CVR NEWS

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో.. వారిని బయటకు తీసేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం కలచివేసింది. ఎట్టకేలకు సహాయక చర్యలు పూర్తిచేసి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రాథమికంగా బస్సు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: